Venkatesh: వెంకటేష్ ఓ డమ్మీ పీస్.. రచయిత ఘోర అవమానం..?
Venkatesh: ఏంటి వెంకటేష్ ఓ డమ్మీ పీసా.. అంత పెద్ద హీరోకి ఇంతలా అవమానమా.. ఇంతకీ వెంకటేష్ ని డమ్మీ పీస్ అంటూ అవమానించిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలు కొంతమంది రైటర్లు,డైరెక్టర్లు సినిమా స్టోరీ చెప్పడానికి వస్తే వాళ్ళు విని నచ్చితే వాళ్ల తండ్రులకు లేక మేనేజర్లకు ఎవరికైనా కథ చెప్పమని చెబుతారు అయితే ఒకవేళ ఆ హీరో కి కథ నచ్చి ఆయనకి సంబంధించిన వాళ్లకు ఈ కథ నచ్చకపోతే సినిమా పట్టాలెక్కదు.

Venkatesh is a dummy piece
అలా వెంకటేష్ దగ్గర కూడా ఓ రైటర్ కి అలాంటి అనుభవమే ఎదురైందట. దాంతో వెంకటేష్ పై తన అక్కసు వెల్లగక్కారు రైటర్.మరి ఇంతకీ ఆ రైటర్ ఎవరయ్యా అంటే.. బెజవాడ ప్రసన్న కుమార్.. ఈయన పేరు చెప్పగానే తెరపైకి ఎన్నో సినిమాలు వినిపిస్తాయి. ఎందుకంటే ఈయన రచయితగా చేసిన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలా ధమాకా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, హలో గురు ప్రేమకోసమే, నా సామి రంగా, నేను లోకల్,మజాకా వంటి సినిమాలకు ఈయన రచయితగా పనిచేశారు.(Venkatesh)
Also Read: Heroines: హీరోయిన్లు ఆ డైరెక్టర్ తో ఆ పని చేస్తే ఇండస్ట్రీలో స్టార్స్ అవుతారా.?
అయితే అలాంటి ప్రసన్నకుమార్ వెంకటేష్ పై తనకు ఉన్న అక్కసు మొత్తం వెలగక్కారు. ఎందుకంటే వెంకటేష్ తో సినిమా చేద్దామని ప్రసన్నకుమార్ కథ చెప్పాలని వెళ్లారట. అయితే కథ విన్న వెంకటేష్ బాగుందని చెప్పినప్పటికీ సురేష్ బాబుకి కథ చెప్పమనంతో సురేష్ బాబుకి కూడా ఈ స్టోరీ వినిపించారట ప్రసన్నకుమార్. కానీ సురేష్ బాబుకి కథ నచ్చకపోవడంతో నాకు నచ్చలేదు అని మొహం మీదే చెప్పారట.ఇక ఇద్దరు అన్నదమ్ములు అనుకొని ఈ సినిమాని చేయడానికి ఇష్టపడలేదట.అలా డేట్స్ కోసం వెళ్ళిన ప్రసన్నకుమార్ కి అవమానం జరగడంతో అప్పటినుండి వెంకటేష్ కి సినిమా కథలు చెప్పడం మానేశాను..

ఆయనతో సినిమాలు చేయను అంటూ రీసెంట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు బెజవాడ ప్రసన్నకుమార్. ఇక ఈయన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ వెంకటేష్ అన్న చెబితేనే ఓకే చేస్తారా.. ఆయనకు కథల సెలక్షన్ తెలియదా.. ఆయన డమ్మీ నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రసన్నకుమార్ వెంకటేష్ పై చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Venkatesh)