Venkatesh: హిట్టోచ్చినా అయోమయంలోనే వెంకీ.. బూతు సినిమా కోసం ఇంత టైం వేస్టా!

Venkatesh: విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, దాదాపు ₹300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. గత ఏడాది సైంధవ్ పరాజయం తర్వాత వచ్చిన ఈ విజయం వెంకటేష్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా ద్వారా కుటుంబ ప్రేక్షకులు ఎంతగా మంచి కంటెంట్‌ని ఆదరిస్తారో స్పష్టమైంది.
Venkatesh not finalizing next film
ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. అయితే వెంకటేష్ మాత్రం తన తదుపరి సినిమాను ఎవరితో చేయాలో ఇంకా తేల్చుకోలేదు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుతున్నా, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
వెంకటేష్ ప్రస్తుతం పూర్తిగా కుటుంబ కథా చిత్రాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతను విన్న కొన్ని కథల్లో కొన్ని బాగా నచ్చినా, ఏదీ ఫిక్స్ చేసుకోవాలన్న విషయంలో ఆయన కొంత తడబడుతున్నారు. అలాగే, ఇద్దరు దర్శకుల మధ్య కాస్త confusionలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, రానా దగ్గుబాటితో కలిసి వెంకటేష్ నటిస్తున్న Rana Naidu 2 వెబ్ సిరీస్ పనులు కూడా నడుస్తున్నాయి. ఆ సిరీస్ పూర్తయిన తర్వాత వెంకటేష్ తన కొత్త సినిమా విషయంలో స్పీడ్ పెంచే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ఆయన కొత్త సినిమా ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.