Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అదిరిపోయే కానుక ఇస్తున్న అనిల్ రావిపూడి!!

Venkatesh Upcoming Film Features New Song

Venkatesh: వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ఒక పాట ఇప్పుడు అందరిలో చర్చకు కారణం అవుతుంది. ఈ పాట, ‘గోదారి గట్టు మీద చందమామవే’ అనే లిరిక్ తో మొదలవుతుండగా ఈ పాటను ప్రముఖ గాయకుడు రమణ గోగుల పడుతుండడం విశేషం. ఈ పాట లిరికల్ వీడియో డిసెంబర్ 3న విడుదల కానుంది.

Venkatesh Upcoming Film Features New Song

గాయకుడు రమణ గోగుల ఈ పాటను పాడడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే, ఆయన వెంకటేష్‌తో కలిసి గతంలో చాలా సినిమాలు పనిచేశారు. ఇప్పుడు మళ్లీ వెంకటేష్ సినిమాలో పాడే అవకాశం రావడంతో, రమణ గోగులతో పాటు అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పాటకు సంగీతం భీమ్స్ సిసిరోలియో, భాస్కరభట్ల సాహిత్యం, మరియు రమణ గోగుల, మధుప్రియలు గానం ఇచ్చారు.

Also Read: NTR Film Title: ఎన్టీఆర్ సినిమా కి టైటిల్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్… పోలా… అదిరిపోలా!!

‘గోదారి గట్టు మీద చందమామవే’ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అయన పేర్కొన్నారు. రమణ గోగుల తన హస్కీ గొంతుతో ఈ పాటను పాడడంతో అభిమానులు మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు. “వింటేజ్ రమణ గోగుల” అనే కామెంట్లతో నెటిజన్లు ఈ పాటను పొగిడేస్తున్నారు. ఈ పాట తో సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరుగుతాయని చెప్పొచ్చు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి భారీ అంచనాలు ఏర్పరుచుకుంటుంది. సినిమా విడుదలతో పాటు ఈ పాట కూడా ప్రత్యేకమైన స్థానాన్ని పొందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *