Venu Madhav: ఆయన వల్లే చనిపోయిన వేణుమాధవ్.. ఇన్నాళ్లకు బయటపడ్డ షాకింగ్ నిజం.?
Venu Madhav: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం మాత్రమే. కానీ బ్రహ్మానందం తర్వాత వచ్చిన కామెడీ యాక్టర్లలో మంచి పేరు సంపాదించుకున్న కమెడియన్ వేణుమాధవ్. ఇండస్ట్రీలో అందరూ కమెడియన్లు ఒక లెక్క అయితే వేణుమాధవ్ కామెడీ మరో లెక్కగా ఉండేది. అలాంటి వేణుమాధవ్ ఎన్నో కష్టాలు పడి మిమిక్రీలు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
Venu Madhav died because of him
అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఆయనకు చేసిన మొదటి చిత్రంతోనే ఎంతో పేరు సంపాదించుకున్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మూవీ ద్వారా హాస్యనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత లక్ష్మి అనే మూవీలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతలతో కలిసి చేసిన కామెడీ ఇప్పటికి టీవీల్లో వస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఈ కామెడీకిగాను ఆయనకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. (Venu Madhav)
Also Read: Vijay: ఒకే హోటల్ రూమ్ లో ఆ హీరోయిన్ తో విజయ్.. సంగీతకు న్యాయం చేయాలంటూ.?
ఈ మూవీ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్, సాంబ, ఆది, దిల్, సై వంటి ఎన్నో చిత్రాలు క్యూ కట్టాయి. అలా స్టార్ కమెడియన్ గా మారిన వేణుమాధవ్ ఓ లెవెల్లో కొనసాగుతున్న సమయంలోనే అనారోగ్య పరిస్థితులు వచ్చి మరణించారు. ఆయనకు అనారోగ్య పరిస్థితులు రాగానే తొందరగా మరణించడానికి కారణం ఒకరున్నారట. వారెవరు ఇప్పుడు చూద్దాం.. అయితే వేణుమాధవ్ మృతికి కారణాలు అప్పట్లో అనేకం వచ్చాయి. అసలు కారణం తన సోదరుడేనట.
అయితే వేణుమాధవ్ మరణించడానికి మూడు నెలల ముందు సొంత సోదరుడు మరణించాడట. ఆయన అంటే వేణుమాధవ్ కు ప్రాణం కంటే ఎక్కువట.. సోదరుడి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన వేణుమాధవ్ ఇక కోలుకోలేదట. కిడ్నీల సమస్య తీవ్రవం అవ్వడంతో ఆయన కూడా మరణించాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఏది ఏమైనా ఒక మంచి కామెడీయన్ ని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం.(Venu Madhav)