Venu Swamy: ఏపీలో ఎప్పుడైతే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే వేణు స్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో రిలీజ్ చేసి ఇప్పటి నుండి నేను ఏ సెలబ్రెటీ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు వాళ్ళు అడగకముందు మీడియాలో బయట పెట్టనని,పర్సనల్ విషయాలు అస్సలు చెప్పనంటూ వేణు స్వామి క్షమాపణలు కోరుతూ వీడియో పెట్టారు. కానీ కుక్క తోక వంకరా అన్నట్లు మళ్లీ తన జాతకాలు చెప్పడం మొదలు పెట్టేశారు అంటున్నారు ప్రస్తుతం వేణు స్వామి వైఖరి చూసినా కొంతమంది నెటిజన్స్. ఎందుకంటే తాజాగా శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వారి జాతకాలు ఎలా ఉండ బోతున్నాయో రేపు చెబుతాను అని నిన్న వారి జాతకాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టారు.
Venu Swamy: Naga Chaitanya third marriage with that heroine
నిన్న ఆయన శోభిత నాగచైతన్య జాతకం చెబుతూ.. సమంతతో నాగచైతన్య బంధం ఎలా అయితే బ్రేక్ అయిందో వీరిద్దరి మధ్య బంధం కూడా అలాగే తెగిపోతుంది. వీరు 2027 వరకే కలిసి ఉంటారు. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు వస్తాయి. అలాగే వీరి మధ్య గొడవలు రావడానికి ఒక స్త్రీ ప్రధాన కారణం అవుతుంది. అయితే ఈ విషయం నేను చెబితే అందరూ నన్ను ట్రోల్స్ చేసి నన్ను విమర్శిస్తారు. అయినప్పటికీ నాకు ఎలాంటి బాధ లేదు.ఎందుకంటే వారి జాతకాలు అలా ఉన్నాయి అవి చెబుతున్నాను అంతే.ఇక చైతన్య సమంతకు మధ్య 50% బంధం ఉంటే శోభితకు చైతన్యకు మధ్య కనీసం 10% బంధం కూడా బలంగా లేదు. (Venu Swamy)
Also Read: Samantha: చైతూ పెద్ద సైకో.. శోభిత కు కూడా సమంత గతే పడుతుంది..?
50% బంధం ఉన్న వారే విడాకులు తీసుకున్నారు. అసలు వీరి మధ్య 10 పర్సెంట్ బంధం కూడా లేదు. వీరు కూడా విడాకులు తీసుకుంటారు. అలాగే వీరి నిశ్చితార్థం చేసుకున్న సమయం కూడా మంచి ముహూర్తం కాదు. ఇక వీరి జాతకంలో నేను చెప్పింది జరగకూడదు అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను. వీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి.కానీ జాతకాన్ని మార్చలేం అంటూ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఇక వేణు స్వామి పెట్టిన వీడియో చూసిన చాలామంది నెటిజెన్లు నాగచైతన్య రెండో పెళ్లితో ఆగడు కావచ్చు మరో హీరోయిన్ ని మూడో పెళ్లి కూడా చేసుకుంటాడు వేణు స్వామి చెప్పిన దాంతో తేటతెళ్లమైంది.
ఎందుకంటే శోభిత చైతు మధ్యలో కూడా ఓ స్త్రీ వల్ల గొడవలు వస్తాయి. అప్పట్లో సమంత చైతు మధ్య కూడా ఓ స్త్రీ వల్ల గొడవలు వస్తాయని వేణు స్వామి చెప్పారు. ఆయన చెప్పినట్లే శోభిత వల్ల గొడవలు వచ్చి విడిపోయారు. ఇక చైతు శోభితల మధ్య కూడా స్త్రీ వల్ల అంటే మరో హీరోయిన్ వల్ల వీరిద్దరి మధ్య గొడవ వచ్చి వీరు కూడా విడిపోతారు. అలా నాగచైతన్య ఆ హీరోయిన్ ని మూడో పెళ్లి చేసుకుంటారు అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.(Venu Swamy)