Vidudala 2 Review: విడుదల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
మూవీ : Vidudala 2 Review
నటీనటులు : విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులు
దర్శకుడు : వెట్రిమారన్
నిర్మాతలు : ఎల్రెడ్ కుమార్, రామారావు చింతపల్లి
సంగీత దర్శకుడు : మాస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్
ఎడిటింగ్ : ఆర్ రమర్
విడుదల తేదీ: 20-12-2024
Vidudala 2 Review and rating
సీక్వెల్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే అవి విడుదలకు ముందే మంచి బజ్ కలిగిస్తాయి. ఈ కోవలోనే ‘విడుదల-2’ కూడా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో విజయవంతమైన ‘విడుదల-1’కి కొనసాగింపుగా వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి కథనంతో ముందుకు వచ్చిన ‘విడుదల-2’ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకోగా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ: కథ లోకి వస్తే.. మొదటి పార్ట్ లో పోలీసులు పట్టుకున్న కురుపన్ గా పిలవబడే పెరుమాళ్ (విజయ్ సేతుపతి) ని విచారణ నుంచే మొదలవుతుంది. ఈ క్రమంలో తనని పట్టించడంలో కీలక పాత్ర పోషించిన కుమరేసన్ (సూరి) కి ఎలాంటి ప్రమోషన్ ని అందుకున్నాడా లేదా? ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న పెరుమాళ్ ని ఏం చెయ్యాలని ప్లాన్ చేస్తారు? అందుకు పరిస్థితులు ఎలా మారాయి. అసలు ఈ పెరుమాళ్ ఎవరు? అతడెందుకు బలహీన, అణగారిన వర్గాలు కోసం అంతలా పోరాడుతాడు? తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? ఈ క్రమంలో కుమరేసన్ రియలైజ్ అయ్యింది ఏంటి అనేది ఈ సినిమాలో అసలు కథ.
నటీనటులు: విజయ్ సేతుపతి పెరుమాళ్ పాత్రలో ఒదిగిపోయిన తీరు అసాధారణం. సినిమా మొత్తం ఆయన నటనతో ఆకట్టుకుంది. ఎంతో సహజంగా ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులకు ‘విజయ్ సేతుపతి’ దగ్గరవుతాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన భావోద్వేగాలు గొప్పగా అనిపిస్తాయి. మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ తన సత్తా చాటారు. పాత్రలో పూర్తిగా లీనమై, దానికి జీవం పోశారు. తదుపరి పాత్రలలో గౌతమ్ మీనన్, కన్నడ కిషోర్, సూరి వంటి నటులు ఆకట్టుకున్నారు. తక్కువ నిడివి కలిగిన పాత్రలే అయినా తమదైన ముద్ర వేశారు.
సాంకేతికే నిపుణులు: ఉద్యమం నేపథ్యంలోని సీరియస్ కథలో ప్రేమకథను చొప్పించడం సవాలుతో కూడుకున్న ప్రయోగం.. దానిని దర్శకుడు ఈజీ గా చేసేశాడు. మహిలల్ని హింసించడం, పోలీసులు, దళ సభ్యుల ఘర్షణలతో నిండిన రక్తపాతం వంటి ఉద్యమ కథల్లో సాధారణ అంశాలను కూడా, నటీనటుల వ్యక్తిత్వాలతో రియలిస్టిక్‌గా చూపించారు. కథ కేవలం నక్సలైట్ కోణంలోనే ఉండటం, డాక్యుమెంటరీ మాదిరిగా నెరేషన్ నెమ్మదిగా సాగడం కథా ఉధృతిని తగ్గించింది. నక్సలైట్ అంశాన్ని డీటైల్‌గా చూపించిన దర్శకుడు, టఫ్ సబ్జెక్ట్‌ను లోతుగా హ్యాండిల్ చేశాడు.ఇళయరాజా సంగీతం కథ యొక్క గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తుంది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీతో ప్రకృతిని అద్భుతంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలం:
విజయ్ సేతుపతి నటన
దర్శకత్వం
సంగీతం
బలహీనత:
అక్కడక్కడా ల్యాగ్ అనిపించడం
తీర్పు: మొత్తంగా, ‘విడుదల-2’లో నటీనటుల ప్రదర్శనలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి, మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ అత్యుత్తమమైన నటనతో ఈ చిత్రాన్ని మరింత విశేషంగా మలిచారు.
రేటింగ్: 3/5