Vijay Deverakonda: బాలీవుడ్‌లో పంబ రేపబోతున్న విజయ్ దేవరకొండ.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా?


Vijay Deverakonda kill movie director

Vijay Deverakonda: టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వేసవిలో “కింగ్డమ్” (Kingdom) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan), రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నారు. అంతేకాదు, కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాణంలో నిఖిల్ నగేష్ భట్ (Nikhil Nagesh Bhatt) డైరెక్షన్‌లో ఓ హిందీ సినిమా కూడా అంగీకరించారు.

Vijay Deverakonda Bollywood Movie

బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆయన గతంలో చేసిన హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించకపోయినా, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరణ్ జోహార్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్‌తో సినిమా చేయడం, బాలీవుడ్‌లో విజయ్ హవాను పెంచే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయన హిందీ మార్కెట్లో స్టార్డమ్ సెట్ చేసుకుంటారని భావిస్తున్నారు.

విజయ్ దేవరకొండ, నిఖిల్ నగేష్ భట్ కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అదే ఏడాదిలో మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *