Vijay Sethupathi: పూరీ తో సినిమా ట్రోల్స్ పై విజయ్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సేతుపతి!!

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించడంతో ఆయనపై నెటిజన్లు ట్రోలింగ్ (Trolling) ప్రారంభించారు. ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో ఉన్న పూరితో సినిమా చేయడం ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటివరకు మౌనంగా ఉన్న విజయ్ తాజాగా స్పందించారు.
Vijay Sethupathi responds to criticism
“నాకు జయాపజయాలతో పని లేదు. ఒక కథ నచ్చితే చాలు. పూరి చెప్పిన కథ పూర్తిగా కొత్తగా అనిపించింది,” అని విజయ్ అన్నారు. తాను ఇప్పటివరకు అటువంటి కథ చేయలేదని, కథ కొత్తదనమే తనకు కీలకమని అన్నారు. అందుకే పూరితో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నానని వివరించారు. ఈ సినిమా June నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు.
ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు (Tabu) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆమెకు ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ కావడం విశేషం. విభిన్నమైన పాత్రల కోసం ఫేమస్ అయిన టబు, పూరి సినిమాలో నటించడమే ఆమె పాత్ర ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
ఇక దర్శకుడిగా పూరి జగన్నాథ్ గతంలో ‘లైగర్’ (Liger), ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) లాంటి డిజాస్టర్‌లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఈసారి విజయ్ వంటి భారీ హీరోతో పని చేస్తుండటంతో పూరి ఓ strong comeback ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.