Vijayasai Reddy: విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయ సన్యాసమే ?
Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు(శనివారం) రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
Vijayasai Reddy sensational decision
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని… రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను పేర్కొన్నారు. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అని ఎమోషనల్ అయ్యారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని….. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పెట్టారు.