Vijayasaireddy: మరోసారి రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ప్లానంత జగన్ దేనా ?
Vijayasaireddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి మరోసారి బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటు మరోసారి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి.. రాజ్యసభ కు వెళ్లేందుకు విజయ సాయి రెడ్డికి అన్ని దారులు ఓపెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చలు జరిగాయట.

Vijayasai Reddy to Rajya Sabha once again
కాగా గత మూడు నెలల కిందట వైసీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసిపి పార్టీతో పాటు రాజ్యసభ పదవికి కూడా సాయి రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి…. ఆ తర్వాత వైసిపి పార్టీని టార్గెట్ చేసి విమర్శలు చేశారు.
KCR: కెసిఆర్ సభ… దిగివచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఆకట్టుకునేందుకు విజయసాయిరెడ్డికి వలవేసిందట బిజెపి పార్టీ. ఇందులో భాగంగానే రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట బిజెపి. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గ నేతలు అందరిని బిజెపి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత విజయసాయిరెడ్డికి అప్పగించ బోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Fuel Price Decrease: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!!