Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోపంతో చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లో మరోసారి అవుట్ అవ్వడం, అంపైర్ కాల్ తనకి ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడంతో కోహ్లీ విపరీతమైన కోపంతో ఐస్ బాక్స్ ను బద్దలు కొట్టాడు. పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. Virat Kohli
Virat Kohli bursts anger on water box after getting out in 2nd Test against New Zealand
చేదనలో మిచెల్ శాంట్నర్ వేసిన 29వ ఓవర్ చివరి బంతిని కోహ్లీ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాటర్ ను మిస్సై బంతి ప్యాడ్లను తాకింది. న్యూజిలాండ్ ఆప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ అవుట్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ రివ్యూని కోరడం జరిగింది. బంతి లెగ్ స్టంప్ ను మిస్ అవుతుందనే ఆత్మవిశ్వాసంతో రివ్యూను తీసుకున్నాడు. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్ ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్ తో అవుట్ గా తేల్చి చెప్పారు. Virat Kohli
Also Read: IND VS NZ: స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమికి కారణాలేంటి?
అనంతరం అంపైర్ ను ఆవేశంగా చూస్తూ విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే దారిలో కోపాన్ని ఆపుకోలేక కోహ్లీ అక్కడే ఉన్న ఐస్ బాక్స్ ను తన బ్యాటుతో బద్దలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలి ఇన్నింగ్స్ లోను కోహ్లీ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లోనే అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఫుల్ టాస్ కు బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ కెరీర్ లో ఇది అత్యంత చెత్త అవుట్ అని అనేక రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. Virat Kohli