Vishwambhara: రాక్షసులతో ప్రత్యేక ఫైట్.. చిరంజీవి విశ్వంభర లో విచిత్రమైన ఫైట్!!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం ఓ సరికొత్త సోషియో-ఫాంటసీ ప్రపంచానికి తీసుకెళ్తోంది. దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు పూర్తిగా కొత్తగా ఆలోచించి, మాయలోకాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో చూపించే విజువల్స్ మరింత విశేషంగా ఉంటాయని సమాచారం. ప్రత్యేకంగా పిల్లలు ఈ సినిమాను ఎంతో ఇష్టపడేలా ఉన్నదని అంటున్నారు.
Vishwambhara Chiranjeevi fight six demons
ఈ చిత్రంలో చిరంజీవి ఆరుగురు రాక్షసులతో పోరాడే ప్రత్యేకమైన ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సన్నివేశం సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఇందులో చూపించే విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి లోకం, ప్రతి పాత్రను దర్శకుడు వశిష్ట ఎంతో క్రియేటివ్‌గా డిజైన్ చేశారని సమాచారం.
సినిమాకు ఎమ్.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట విడుదల కాగా అది తొలి పాట కాగా ఇది రాముడు మరియు హనుమంతుని మధ్య ఉన్న బంధాన్ని ఆధారంగా చేసుకుని ఉండగా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో హనుమంతుడు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అతను చిరంజీవి పాత్రను రక్షిస్తూ, కథలో ప్రధానంగా కనిపిస్తాడట.
ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజున మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’ విడుదలై బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టించింది. ఆ విజయ సెంటిమెంట్‌ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ డేట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విజువల్ వండర్‌తో వస్తున్న విశ్వంభరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.