Vishwambhara: చిరు ‘విశ్వంభర’.. పాటలపై ఇంత ఫోకస్ ఎందుకు?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర నుంచి తొలి పాట విడుదలైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రిలీజ్ చేసిన ఈ పాట “రామ.. రామ..” అనే లిరిక్స్‌తో అలరిస్తోంది. ఎం.ఎం. కీరవాణి అందించిన ట్యూన్‌కు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పదాలతో లిరిక్స్ రాశారు. లిరికల్ వీడియోలో కొన్ని విజువల్స్‌ని చూపించారు. చిరు లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శోభి మాస్టర్ ఈ పాటకు స్టైల్‌తో కూడిన కొరియోగ్రఫీ చేశారు.
Vishwambhara Massive Set Song Details
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ పాట కోసం ఏకంగా రూ.6 కోట్ల వ్యయంతో భారీగా చిత్రీకరణ జరిగింది. నాలుగు గ్రాండ్ సెట్లు వేశారు. సుమారు 400 డాన్సర్లు, 400 మంది జూనియర్లు, 15 మంది నటీనటులు ఈ పాటలో కనిపించబోతున్నారు. దాదాపు 12 రోజుల పాటు ఈ పాటను షూట్ చేసినట్టు సమాచారం. లిరికల్ వీడియోలో పాట మేకింగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థియేటర్లో మాత్రం ఈ పాట మరింత కలర్‌ఫుల్‌గా అలరించబోతోందని చిత్రబృందం అంటోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకున్నారు. కానీ ఆ హీరోయిన్ ఎవరో మాత్రం మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. ఇది సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మాస్ ఆడియెన్స్‌కి ఈ పాట ప్రత్యేకంగా నచ్చుతుందని టీమ్ ఆశిస్తోంది.
త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో జులై 24న విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. మే నుంచి మిగిలిన పాటలన్నీ ఒకొక్కటిగా విడుదల చేయబోతున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆ పాటను కూడా మాస్ హంగులతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.