Vishwambhara Movie Songs: విజువల్ గానే కాదు మ్యూజిక్ పరంగా కూడా ‘విశ్వంభర’ ఫ్యాన్స్ మాస్ ట్రీట్!!
Vishwambhara Movie Songs: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా,యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “విశ్వంభర” పై సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ట్రీట్ కానుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ & ఆడియో వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి.
Vishwambhara Movie Songs Latest News
ఇటీవల, MM కీరవాణి ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రకారం, విశ్వంభర లోని పాటలు అద్భుతంగా ఉంటాయని, ఫ్యాన్స్‌కి అవి కొత్త అనుభూతిని అందించనున్నాయని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ సింగిల్ ను శివరాత్రి స్పెషల్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, కీరవాణి కలయికలో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మ్యూజికల్ అల్‌టైమ్ హిట్ ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా మే నెలలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోందని సమాచారం. అయితే, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.