Anushka: అనుష్క వల్ల హీరోయిన్ జీవితం నాశనం అయిందా.. నమ్మించి.?


 Was the heroine life ruined because of Anushka

Anushka: ఏంటి అనుష్క శెట్టి కారణంగా మరో హీరోయిన్ జీవితం నాశనం అయిందా? అసలు అనుష్క శెట్టి చేసిన తప్పేంటి.. ఆ హీరోయిన్ జీవితం నాశనం అవ్వడానికి ఈ హీరోయిన్ ఎలా కారణమైంది అనేది ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ఎన్నో సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్.ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ తో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.అలా అనుష్క అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి ఎన్నో లేడి ఓరియంట్ సినిమాలు చేసింది.

Was the heroine life ruined because of Anushka

అయితే అలాంటి అనుష్క శెట్టి కెరియర్లో ది బెస్ట్ మూవీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అరుంధతి మూవీ మాత్రమే.ఈ సినిమాలో అనుష్క శెట్టి యాక్టింగ్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. ఇప్పటికి కూడా టీవీలలో ఈ సినిమా వస్తే చాలామంది ఇష్టపడి చూస్తారు. ఇక ఈ సినిమాలో అరుంధతి పాత్ర పోషించిన అనుష్క శెట్టి ఇండస్ట్రీలో జేజమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ జేజమ్మ పాత్ర మొదట అనుష్కకి కాకుండా మరో సీనియర్ నటికి వచ్చిందట.కానీ ఆ నటి ఈ సినిమా చేయకపోవడం కారణంగా అది అనుష్కకి వచ్చిందట. (Anushka)

Also Read: Tamannaah: ప్రియుడితో బ్రేకప్.. ఆ నిర్మాతతో తమన్నా హాట్ ఫొటోస్.?

ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి ప్రేమ. కోడి రామకృష్ణ డైరెక్షన్ వహించిన అరుంధతి మూవీలో మొదట అరుంధతి పాత్రలో చేసే అవకాశం సీనియర్ నటి ప్రేమకే వచ్చిందట.కానీ అప్పటికే నటి ప్రేమ వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం కారణంగా అరుంధతి మూవీని వదులుకోవాల్సి వచ్చింది.దాంతో డైరెక్టర్ అనుష్క శెట్టిన ఈ సినిమాలో తీసుకున్నారు అలా ఈ సినిమా అనుష్క చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.అయితే ఈ సినిమా చేశాక ప్రేమ ఈ సినిమా చూసి చాలా బాధపడిపోయిందట.అంతే కాదు ఇంత మంచి ఛాన్స్ నేను ఎలా వదులుకున్నాను అని తెగ బాధపడిపోయిందట.

 Was the heroine life ruined because of Anushka

కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లు ఈ సినిమా విడుదలయ్యాక అరుంధతి మూవీలో అనుష్క కంటే మరో హీరోయిన్ ఇందులో సెట్ అయ్యేది కాదు అని చాలామంది గొప్పగా మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా ప్రేమ మిస్ చేసుకుంటే అనుష్క ఎలా కారణం అవుతుంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ డైరెక్టర్ ను మొదట ప్రేమ కొద్దిరోజులు వెయిట్ చేయమని అడిగిందట. కానీ డైరెక్టర్ మాత్రం వినకుండా అనుష్కని తీసుకున్నారట. అలా అనుష్కకి ఛాన్స్ రావడంతో నటి ప్రేమ అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకుంది.(Anushka)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *