Black Pepper: నల్లమిరియాలతో 100 ప్రయోజనాలు..కానీ అతిగా తింటే ?
Black Pepper: మన శరీరంలో ఎన్నో అత్యంత కీలకమైన అవయవాలు ఉన్నాయి అందులో మెదడు ఒకటి. మెదడు చురుగ్గా పనిచేస్తేనే ఇతర భాగాలు చురుగ్గా ఉంటాయి. ఈ మధ్య చాలా మంది మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మెదడు కణాలు చనిపోకుండా వాటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడు కణాలు క్రమంగా చనిపోతుంటే చాలా ప్రమాదం వాటిల్లుతుంది.
What are the benefits of black pepper
బ్రెయిన్ లో కొన్ని రకాల హానికరమైన ప్రోటీన్లు విడుదల అయ్యి మెదడు కణాలను నశించేలా చేస్తాయి. ఇలాంటి వ్యాధుల నుంచి మనం మెదడును కాపాడుకోవాలంటే మిరియాలను క్రమంగా వాడుతూ ఉండాలి. మిరియాలలో పెప్పరిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్ ను నశింపచేస్తుంది. దానివల్ల మెదడుకు మేలు కలుగుతుంది. మిరియాలు తినడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుంది.
Also Read: BRS: బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి.. అసలు నిజాలు ఇవే..వీడియో వైరల్ ?
వంటలలో కారానికి బదులుగా మిరియాలను వాడుతూ ఉండాలి. సలాడ్స్, సూప్స్, ప్రైస్ వంటి వాటిలో మిరియాల పొడి వాడుతూ ఉండాలి. మిరియాల పొడి తిన్నట్లయితే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నివేదికలో వెల్లడయింది. అయితే మిరియాల పొడి మరీ ఎక్కువగా కాకుండా సరిపోయినంతగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఎక్కువగా తిన్నట్లయితే కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయట. అందువల్ల మిరియాలను అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.