Beer: 30 రోజులు వరుసగా బీర్ తాగితే ఏం అవుతుంది ?

Beer: పార్టీ ఏదైనా సరే చల్లని బీరు తప్పకుండా ఉండాల్సిందే. బీరు లేకుంటే ఆ లోటు తప్పకుండా ఉంటుంది. అందుకే బ్యాచిలర్ సమయం దొరికినప్పుడల్లా చేతిలో బీరు సీసాతో దర్శనమిస్తారు. అయితే చాలామంది మేము తాగేది బ్రాందీ కాదు బీరే కదా అని తాము చేసే పనిని తెలివిగా సమర్ధించుకుంటారు. కానీ బీరే కదా అని పరిమితికి మించి తాగినట్లయితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే కొందరు మాత్రం బీరు తాగడం వల్ల ఎలాంటి హాని ఉండదని అనుకుంటారు.

What happens if you drink beer for 30 days in a row

బీర్ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందే కానీ నష్టం ఉండదని చెబుతున్నారు. నిజానికి బీర్ తాగడం వల్ల లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి. కానీ రోజు ఎక్కువగా బీర్ తాగితే మాత్రం శరీరంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ప్రతిరోజు బీర్ తాగడం వల్ల బరువు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇందులో ఉండే క్యాలరీల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు, కాలేయం, ఆల్కహాలిక్, హైపటైటిస్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు వస్తాయి. రోజు బీర్ తాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి.

అదే ఒక వ్యక్తి 21 రోజులు పాటు నిరంతరం బీరు తాగినట్లయితే శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది. మూత్ర విసర్జనకు ఇబ్బంది ఏర్పడుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీని వల్ల డిప్రెషన్ వస్తుంది. ఇది కార్డియోమయోపతి, స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అతిగా బీర్ తాగడం వల్ల అలసట, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. రోజుకు 90 ఎంఎల్ కన్నా ఎక్కువగా ఆల్కహాల్ తాగినట్లయితే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాలేయం పరిమాణం, పనితీరు దెబ్బతింటుంది. దీన్నే లివర్ సిర్రోసిస్ అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్న వారు అదే పనిగా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఇంకా త్వరగా కాలేయం పాడవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *