Moong Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?


Moong Sprouts: నేటి కాలంలో చాలామంది బరువు అధికంగా ఉండడం వల్ల డైట్ ఫాలో అవుతున్నారు. ఇక డైట్ ఫాలో అయ్యేవారు వారు తీసుకునే ఆహారంలో తప్పకుండా మొలకలను చేర్చుకుంటారు. ఇవి మొలకలు మంచి పోషక ఆహారమని చెప్పవచ్చు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గడానికి మొలకలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ మొలకలు కొవ్వులు నియంత్రించడానికి, పొట్ట, బరువు సమస్యలను తగ్గించడానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. మొలకలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి.

What happens if you eat moong sprouts daily

ప్రతిరోజు మొలకలు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అయితే కొంతమంది గింజలను నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తూ ఉంటారు. అయితే చాలా వరకు మొలకలను ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. మొలకలను నానబెట్టి ఒక వస్త్రంలో చుట్టి పెడితే తెల్లారేసరికి మొలకలు వస్తాయి. అయితే కొంతమంది ఇలా చేసుకోవడం పెద్ద పనిగా భావిస్తూ ఉంటారు. అయితే వీటిని తయారు చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి. ఇంట్లోనే మొలకలను తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెసర్లలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అయితే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు పెసర్లను తినకూడదు.

IPL 2025: ఐపీఎల్ లో పెన్షన్ పొందే ప్లేయర్లు లిస్ట్‌ ఇదే?

ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాల సమస్యలు అధికమవుతాయి. అలర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా మొలకలను తినడం మానుకోవాలి. దీనివల్ల అలర్జీ, దురద, చర్మ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. మలబద్ధకం ఉన్నవారు కూడా మొలకలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అయితే మొలకలను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వీటిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా మొలకలు తినిపించడం వల్ల వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది.

Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *