Coconut Water: కొబ్బరి నీళ్లలో ఈ రసం కలిపి తాగితే… 100 రోగాలు దూరం ?
Coconut Water: శరీరానికి ఎంత ఎక్కువగా నీళ్లు అందితే ఆరోగ్యం అంత బాగుంటుంది. కేవలం నీటికి మాత్రమే కాకుండా కొబ్బరినీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సహజ సిద్ధ పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. ఈ నీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ నీటిని తాగవచ్చు. బరువు తగ్గడంలో కొబ్బరినీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది.

What happens if you mix coconut water with lemon juice and drink it
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మంచిది. ఇది అత్యంత హైడ్రేటింగ్ డ్రింక్. రోజు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అధికంగా ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అయితే గ్లాసు కొబ్బరి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు శరీరానికి అందుతాయి. కొబ్బరినీళ్లు నిమ్మకాయ కలిపి తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఇది కొవ్వును వేగంగా కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
కొబ్బరి నీరు, నిమ్మకాయ కలిపి తాగితే అధిక రక్తపోటు ఉండే రోగులకు బిపి కంట్రోల్ లో ఉంటుంది. ఇది మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్ ని నియంత్రించడానికి ప్రతిరోజు కొబ్బరి నీరు, నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిది. గ్లైసేమిక్ సూచిక తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించడానికి కొబ్బరి నీరు కీలక పాత్ర పోషిస్తాయి. వారంలో రెండు మూడుసార్లు అయినా ఒకసారి కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.