Kalki: కల్కి డైరెక్టర్ అందరికీ సుపరిచితమైన నాగ్ అశ్విన్. ఈయన వైజయంతి బ్యానర్ అధినేత స్టార్ నిర్మాత అయిన అశ్వినీ దత్ అల్లుడు.. ఇక ఈయన తీసినవి తక్కువే సినిమాలే అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఈయన నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహానటి మూవీతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించారు. ఇక సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీకి దర్శకత్వం వహించి ఎంతోమంది ప్రశంసలు పొందారు నాగ్ అశ్విన్.
What is the relationship between that heroine and the director of Kalki
అయితే అలాంటి నాగ్ అశ్విన్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అయినా కల్కి కి దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ మూవీపై ఎన్నో హోప్స్ ఉన్నాయి. అలాగే అంచనాలకు తగ్గట్లే సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లీంమ్స్, ట్రైలర్ ఉన్నాయి. అయితే మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఒక వైరల్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Kalki)
Also Read: TG Vishwa Prasad: పవన్ ని ఇంప్రెస్ చేస్తున్న నిర్మాత.. 2000 మందికి పార్టీ.. దాని కోసమేనా.?
అదేంటంటే ఇప్పటివరకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో ఆ హీరోయిన్ ని పెట్టుకున్నారు. మరి ఆ హీరోయిన్ కి నాగ్ అశ్విన్ కి ఉన్న రిలేషన్ ఏంటి.. ఆ హీరోయిన్ ని తన ప్రతి సినిమాలో తీసుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. తన మూడు సినిమాల్లో నాగ్ అశ్విన్ తీసుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు మాళవిక నాయర్.. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ, మహానటి తాజాగా కల్కి ఈ మూడు సినిమాల్లో కూడా మాళవిక నాయర్ నటించింది.
ఇక మాళవిక నాయర్ కల్కి మూవీలో ఉన్న సంగతి చాలామందికి తెలియదు. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ హీరోయిన్ ఇందులో ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ హీరోయిన్ ని తన ప్రతి సినిమాలో తీసుకోవడానికి కారణం తన మొదటి సినిమా హీరోయిన్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో ఏర్పడిన స్నేహం కారణంగా తన సినిమాల్లో మాళవిక నాయర్ కి స్పెషల్గా ఒక పాత్రని ఇస్తున్నారు నాగ్ అశ్విన్.(Kalki)