Whatsapp: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వారంటూ లేరు. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఉండాలి. యూజర్లకు తగినట్లుగా వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే ఇటీవల నుండి మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే పక్కన బ్లూ పర్పల్ రౌండ్ రింగ్ కనబడుతుంది. ఇది ఎందుకని మీరు ఎప్పుడైనా గమనించారా..? మొబైల్ లోనే కాదు కంప్యూటర్లో కూడా ఈ రింగ్ కనబడుతుంది. దీని వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి చూద్దాం.
Whatsapp blue-purple ring use
కృత్రిమ మేధస్సును ఉపయోగించి మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే మీరు కోరుకున్నట్లుగా చిత్రాన్ని రూపొందించొచ్చు. ఏ అంశంలోనైనా ప్రశ్నలు అడిగితే ఏ వెంటనే మీకు ఆన్సర్ చెప్తుంది. ముందుగా మీరు వాట్సాప్ ఆ రౌండ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ముందు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే అడుగుతారో దానికి వీలైనంత కచ్చితంగా సమాధానాన్ని చెప్తుంది. మీరు కాశ్మీర్ అద్భుతమైన అందాన్ని చూడాలనుకుంటున్నారంటే అప్పుడు మీరు మెటా బాక్స్ లో బ్యూటిఫుల్ కాశ్మీర్ వ్యాలీ ఇమేజస్ లో ఇస్తుంది.
Also read: Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!
మీకు ఆ చిత్రాన్ని తక్షణమే చూపిస్తుంది మీరు ఈ చిత్రాన్ని డౌన్లోడ్ చేసి ఉపయోగించవచ్చు. చూడాలనుకుంటున్న ప్రదేశాలు మొదలు మీరేం కావాలనుకున్న అందులో అడగొచ్చు. ఈ రోజుల్లో పనిని సులభతరం చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు మీరు ఎక్కడైనా ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే మీరు రోజు వారి పనిలో ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ఉపయోగించి తక్షణమే ఉపయోగ వాడొచ్చు. దీని అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించక్కర్లేదు. సో ఇలా మీరు వాట్సాప్ లోనే ఏఐ ని ఉపయోగించవచ్చు కావాల్సిన వాటిని అడిగి తెలుసుకోవచ్చు తెలియని విషయాలు కూడా ఖచ్చితంగా మీరు ఈజీగా తెలుసుకోవడానికి అవుతుంది (Whatsapp).