Whiskey Ice Cream: హైదరాబాద్‌లో కొత్త తరహా దోపిడీ ముఠా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తుండటంతో, కొందరు మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. ఐస్ క్రీమ్ రూపంలో డ్రగ్స్ ను లేసి విక్రయిస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా విక్రయించుతున్నారు.
Whiskey Ice Cream Racket Busted in Jubilee Hills
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన “విస్కీ ఐస్ క్రీమ్ స్కాం” బయటపడింది. జూబ్లీహిల్స్‌లోని ఓ దుకాణంపై పోలీసులు దాడి చేయడంతో ఈ ముఠా అసలు రంగు బయటపడింది. రూట్ 1లోని పార్లర్ నంబర్ 1 మరియు 5పై పోలీసులు దాడి చేసినప్పుడు, విస్కీ ఐస్ క్రీమ్‌ను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పేపర్ విస్కీని ఐస్ క్రీమ్‌లో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుసుకొని, వారిని అరెస్టు చేశారు.
Also Read: Varsha Bollamma: యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ వర్ష బొల్లమ్మ..?
దయాకర్ రెడ్డి, శోభన్ అనే నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సోదాల్లో 60 గ్రాముల ఐస్ క్రీమ్‌లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలిపి విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ దాడుల్లో మొత్తం 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు రూట్ 1లోని 1 మరియు 5 పార్లర్లో నిరంతరం జరుగుతున్నట్లు పోలీసులకు తేలింది.
రుచిగా ఉండడం వల్ల టీనేజర్లు, పిల్లలు ఈ ఐస్ క్రీమ్‌ను ఇష్టపడి తింటున్నారు. అయితే, వారికి తెలియకుండానే ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి మోసాల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.