Neeraj Chopra Wife: నీరజ్ చోప్రా భార్య ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే ?
Neeraj Chopra Wife: భారతదేశపు సూపర్ స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 మొదటి నెలలోనే దేశం మొత్తానికి బిగ్ షాకింగ్ న్యూస్ అందించాడు. ఒలింపిక్ స్వర్ణం రజత పతక విజేత నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నారు. వెటరన్ అథ్లెట్ ఎటువంటి హడావిడి లేకుండా తన కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జనవరి 19 శనివారం రోజున సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమాని.
Who is Himani Mor, Olympian Neeraj Chopra’s wife
నీరజ్ మనసు గెలుచుకున్న ఈ హిమాని ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. హిమాని టెన్నిస్ కోచ్. హర్యానా వాసి. హిమాని పూర్తి పేరు హిమాని మోర్. నీరజ్ వలే ఆమె కూడా హర్యానాకు చెందిన అమ్మాయి. నీరజ్ హర్యానాలోని పానీపట్ జిల్లా ఖండ్రా గ్రామ నివాసి. కాగా, హిమాని పానిపట్ జిల్లా లడ్సౌలి గ్రామానికి చెందిన అమ్మాయి. స్పోర్ట్ స్టార్ నివేదిక ప్రకారం 25 ఏళ్ల హిమాని మోర్ తన ప్రారంభ విద్యను పానిపట్ పాఠశాల నుంచి పూర్తిచేసుకుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ఆ తర్వాత అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోని సౌత్ ఈస్టర్ లూసియానా యూనివర్సిటీ నుంచి పట్టాను పొందింది. అమెరికాలో చదువుకోవడమే కాకుండా అక్కడ టెన్నిస్ ఆడుతూ టెన్నిస్ కోచింగ్ కూడా ప్రారంభించింది. ఆమె యూఎస్ఏలోని న్యూ హంప్ షైర్ లోని ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయంలో వాలంటీర్ టెన్నిస్ కోచ్ గా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె అదే దేశంలోని మసచు సెట్స్ రాష్ట్రంలోని అమ్హేర్స్ట్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా ఉంది. అదే కళాశాల మహిళా టెన్నిస్ జట్టుకు కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఆమె వాటిని పూర్తిగా నిర్వహిస్తోంది. ఆమె మెక్ కర్మాక్ ఐసెన్ బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కూడా చదువుతోంది.