Sukumar-Rajamouli: సుకుమార్ రాజమౌళిలలో ఎవరు గొప్ప డైరెక్టర్.. ఫ్యాన్స్ఏ మంటున్నారంటే..?

Sukumar-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే చాలామంది చూపు రాజమౌళి వైపే మల్లుతుంది. ఎందుకంటే ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్ గా ఆయన మంచి గుర్తింపు పొందారు.. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఇండియా మొత్తంలో చాటి చెప్పిన గొప్ప దర్శకుడని చెప్పవచ్చు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని మించిన డైరెక్టర్ లేరని ఇప్పటివరకు చాలామంది అనుకుంటారు.
Who is the greatest director among Sukumar-Rajamouli
కానీ అదే కోవలోకి తాజాగా ఈ దర్శకుడు కూడా రాబోతున్నాడని సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆదర్శకుడు ఎవరు? రాజమౌళి స్థాయికి వెళ్లే సినిమాలు ఏం తీశాడు అనే వివరాలు చూద్దాం.. జక్కన్న డైరెక్షన్ లో బాహుబలి, బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చి ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలుసు..(Sukumar-Rajamouli)
Also Read: Tarun Adarsh Praises Pushpa2: పుష్ప మూవీ బాలీవూడ్ రివ్యూ..పూనకాలు ఖాయం!!
ఆ విధంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందినటువంటి సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తీసిన విషయం అందరికీ తెలుసు..ఈ చిత్రం విడుదలైన కొన్ని నెలల వరకు ప్రతి సినీ ప్రేక్షకుడిని పుష్ప ఫీవర్ పట్టుకుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్పా2 సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా అద్భుతమైన టాక్ తో ముందుకు వెళ్తోంది.

ఈ మూవీ చూసిన చాలామంది ప్రేక్షకులు బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాయబోతుందని అంటున్నారు. టాలీవుడ్ లో రాజమౌళిని మించే డైరెక్టర్ వచ్చాడని, ఆయనే సుకుమారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఈ విధంగా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు తీస్తూనే బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాజమౌళికి దీటుగా, సుకుమార్ వచ్చాడని చెప్పవచ్చు.(Sukumar-Rajamouli)