Ram Charan: ఉపాసన కానే కాదు.. చెర్రీ మనసు దోచిన హీరోయిన్ ఎవరంటే.?

Ram Charan: రామ్ చరణ్ ఉపాసన లది ప్రేమ వివాహం.. వీరు చదువుకునే సమయంలోనే ప్రేమలో పడి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇక రాంచరణ్ పెళ్లి సమయంలో ఉపాసన ఫేస్ కట్ ని చూసి చాలామంది విమర్శలు చేశారు.కానీ రామ్ చరణ్ గానీ ఉపాసన గాని ఆ విమర్శలు పట్టించుకోలేదు.అయితే ఉపాసన పెళ్లయ్యాక తన లుక్ పూర్తిగా మార్చేసుకుని చాలా సన్నబడి అందంలో హీరోయిన్లకు పోటీని ఇచ్చింది.
Who is the heroine who stole Ram Charan heart
ఇక ఆ టైం లో ఉపాసన చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి సమయంలో నేను ఇలాంటి ట్రోల్స్ బారిన పడ్డాను అని చెప్పుకుంటూ బాధపడింది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి..అలా రామ్ చరణ్ మనసు దోచిన అమ్మాయి గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. (Ram Charan)
Also Read: Ram Charan: రామ్ చరణ్ మీద మోజు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలని చూసి.?
అయితే చాలామంది రాంచరణ్ కి ఇష్టమైన అమ్మాయి అంటే ఉపాసన అని అనుకుంటారు. కానీ ఉపాసన కానే కాదు.ఓ హీరోయిన్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత..అవును మీరు వినేది నిజమే. సమంత అంటే రామ్ చరణ్ కి చెప్పలేనంత ఇష్టమట. ఎందుకంటే ఈ విషయాన్ని ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్వయంగా బయట పెట్టారు.

అలాగే తనకు నటుడు సూర్య యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, సూర్యకి నేను అభిమానిని అంటూ రాంచరణ్ చెప్పారు. అలా హీరోయిన్స్ లో సమంత హీరోలలో సూర్య అంటే ఇష్టమని రామ్ చరణ్ తెలియజేశారు. ఇక సమంత యాక్టింగ్ కి నేను పెద్ద అభిమానిని అంటూ రాంచరణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఇక సమంత రామ్ చరణ్ కాంబోలో సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం మూవీ వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.(Ram Charan)