Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యనే అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే శిరీష్ మరణంతో శ్రీజ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి సంగతులు కొన్ని సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీజ ను ట్రాప్ చేసి మెగాస్టార్ ఫ్యామిలీ పరువు పోయేలా కొంతమంది బడా బాబులు ఈ పెళ్లి చేయించారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.
Who supported Shirish to defame Chiranjeevi family
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీజ శిరీష్ ని ప్రేమించి ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి సమయంలో ఇంట్లో వాళ్లకి భయపడి ఆమె ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించింది. అంతేకాదు ఇంట్లో వాళ్లతో తనకు ఎలాంటి అపాయం లేదు అనుకున్న సమయంలోనే బయటికి వస్తాను అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు శ్రీజ కి ఎలాంటి అపాయం చేయము అని మీడియా ముందు చెప్పారు. (Chiranjeevi)
Also Read: Kalki 2: కల్కి 2 కి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్.. ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో చిత్రీకరణ..!
అలాగే తన కూతురు ఇష్ట ప్రకారమే ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరిస్తున్నాను అని కూడా చిరంజీవి మీడియా ముఖంగా తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన లైసెన్స్డ్ గన్ ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దాంతో శ్రీజ హైదరాబాద్ కు వచ్చింది.అయితే వీరిద్దరి పెళ్లి వెనుక కొంతమంది బడా రాజకీయ నాయకులు ఉన్నారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.
అంతేకాదు చిరంజీవి దీని గురించి మాట్లాడక పోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రంజనసేన పార్టీ పెట్టిన సమయంలో మా శ్రీజని కావాలనే కొంతమంది ట్రాప్ చేసి మా పరువు తీయడానికి ఇలా చేశారు అంటూ వారి పేర్లతో సహా రాజకీయ పార్టీలతో సహా బయటపెట్టారు. కానీ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. పెళ్లయ్యాక భర్త కట్నం కోసం వేధించడంతో శ్రీజ అతనికి విడాకులు ఇచ్చేసి చిరంజీవి ఇంటికి వచ్చేసింది.(Chiranjeevi)