Majaka Movie: మజాకా మూవీని మిస్ చేసుకున్న ఇద్దరు అన్ లక్కీ హీరోస్..చేసుంటే రచ్చరంబోలే.?
Majaka Movie: ఏంటి మజాకా మూవీలో నటించాల్సింది సందీప్ కిషన్, రావు రమేష్ లు కాదా.. ఆ ఇద్దరు హీరోలు మల్టీస్టారర్ చేయాల్సిందా.. ఇంతకీ మజాకా మూవీని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరోస్ ఎవరు? ఎందుకు ఈ సినిమాని చేతులారా మిస్ చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. సందీప్ కిషన్ రావు రమేష్ లు కీలక పాత్రల్లో రీతు వర్మ అన్షూ అంబానీలు హీరోయిన్లుగా వస్తున్న తాజా మూవీ మజాకా.. ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

who unlucky heroes who missed Majaka Movie
అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ డైరెక్టర్ త్రినాధరావు హీరోయిన్ అన్షు అంబానీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. మజాకా మూవీ చేయాల్సింది మెగాస్టార్ చిరంజీవి, సిద్దు జజొన్నలగడ్డనట.. అవును మీరు వినేది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Majaka Movie)
Also Read: Nagarjuna: ఆపరేషన్ థియేటర్లో ఏఎన్ఆర్.. గుడిలో నాగార్జున చేసిన పనికి ఏఎన్ఆర్ కన్నీళ్లు.?
అయితే మొదట మజాకా మూవీని మల్టీస్టారర్ గా చిరంజీవి, సిద్దుల కాంబోలో తండ్రి కొడుకులుగా చూపిద్దాం అనుకున్నారట.కానీ మజాకా మూవీలో రావు రమేష్ చేసిన పాత్ర చిరంజీవి ఇమేజ్ కి సెట్ అవ్వదని ఆయన అభిమానులు ఈ పాత్రను యాక్సెప్ట్ చేయరు అనే ఉద్దేశంతో మెగాస్టార్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో చిరంజీవికి కథ చెప్పినప్పుడు ఏ వెర్షన్ లో చెప్పారో నాకు తెలియదు.

కానీ రావు రమేష్ పోషించిన పాత్ర మాత్రం చిరంజీవికి అస్సలు సెట్ అవ్వదు.ఆయన ఇమేజ్ వేరే కాబట్టి ఈ సినిమా రిజెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అంటూ డైరెక్టర్ చెప్పుకోచ్చారు.అయితే ఈ వార్త మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు అబ్బా జస్ట్ మిస్..చిరంజీవి సిద్దు జొన్నలగడ్డ కాంబోలో సినిమా వస్తే థియేటర్లలో రచ్చరంబోల అవ్వు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Majaka Movie)