KCR: ఎమ్మెల్సీ ఎన్నికలకు BRS ఎందుకు దూరం?
KCR: తెలంగాణ రాష్ట్రంలో… ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పట్టభద్రులు అలాగే టీచర్స్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్, మెదక్, ఖమ్మం, అదిలాబాద్, నల్గొండ, అలాగే వరంగల్ అటు నిజామాబాద్… జిల్లాలను కవర్ చేస్తూ… ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి మూడున ఫలితాలు వస్తాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి.

Why is BRS away from MLC elections
కానీ గులాబీ పార్టీ మాత్రం బరి నుంచి తప్పుకుంది. ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ పార్టీ.. పోటీ చేస్తే గెలిచేదని కొంతమంది వాదిస్తున్నారు. కానీ చివరి క్షణంలో కేసీఆర్ వెనక్కి తగ్గారు. అయితే దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ… అభ్యర్థిగా ఇండిపెండెంట్ బరిలో… బక్క జడ్సన్ ఉన్నారు. అతనికి వెనుక నుండి సపోర్ట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట.
KCR: తెలంగాణలో 10 ఉపఎన్నికలు రానున్నాయి ?
పట్టభద్రులందరూ బక్క జడ్సన్ కు ఓటు వేయాలని గులాబీ పార్టీ నేతలు గ్రౌండ్ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టారట. అయితే.. ఈ ఎన్నికల్లో నేరుగా గులాబీ పార్టీ పోటీ చేసి ఓడిపోతే… ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా పోషిస్తున్న తమ పైన.. ప్రజల్లో నమ్మకం పోయే ఛాన్స్ ఉందని.. కెసిఆర్ తప్పకున్నారట. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టెక్నికల్ తో కూడుకున్నవి. కాబట్టి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. అయితే తెలంగాణలో త్వరలోనే 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయని… కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. అప్పుడు కచ్చితంగా 10 కి 10 గెలుస్తామని కార్యకర్తలతో కేసిఆర్ దిశా నిర్దేశం చేశారట.