Tamil stars: తమిళ హీరో లపై పెరుగుతున్న ఒత్తిడి.. క్రమంగా మార్కెట్ కోల్పోతున్నారా?

Tamil stars: ఒకప్పుడు తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ హీరోలు, ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య లాంటి స్టార్‌లు తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినా, అందుకు తగిన ఫలితం మాత్రం రాలేకపోతోంది. తెలుగు హీరోలు పాన్-ఇండియా స్థాయికి ఎదుగుతుండగా, తమిళ హీరోలు రీజినల్ స్టార్స్‌గా మిగిలిపోతున్నారు.
Why Tamil stars are failing in Tollywood
అజిత్ “విడాముయర్చి” సినిమా విడుదల ఇటీవలే అయ్యింది. తమిళనాట తిరుగులేని స్టార్‌డమ్ ఉన్న అజిత్, తెలుగు మార్కెట్‌పై ఫోకస్ పెట్టినా, ఇక్కడ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోతున్నాడు. అదే విధంగా, విజయ్ కూడా తన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నా, అనుకున్నంత బజ్‌ను మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నాడు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న సూర్య, ఇప్పుడు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడు. రజనీకాంత్ “జైలర్”తో బిగ్ హిట్ కొట్టినా, “వేట్టయన్” నిరాశపరిచింది. అలాగే, విక్రమ్‌తో హిట్ కొట్టిన కమల్ హాసన్, “భారతీయుడు 2” సినిమాతో డిజాస్టర్‌ను ఫేస్ చేశాడు. ఈ పరిస్థితుల్లో, తమిళ హీరోలు తమ మార్కెట్‌ను తిరిగి తెచ్చుకోగలరా? లేక టాలీవుడ్ పాన్-ఇండియా దూకుడు ముందు బలహీనపడతారా? అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.