Empuraan: ఆ ఫ్లాప్ సెంటిమెంట్ లూసిఫర్2 కి ప్లస్ అవుతుందా?
Empuraan: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తాజా చిత్రం “బరోజ్” ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆయన కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో, అభిమానుల దృష్టి పూర్తిగా ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్, మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ “లూసిఫర్ 2” (ఎమ్పురాన్) పై పడింది.
Will Empuraan Break Box Office Records?
“లూసిఫర్” మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించిన సినిమా. ఈ మూవీ తెలుగులోనూ డబ్ అయి మంచి స్పందన అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిని “గాడ్ ఫాదర్” పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా “ఎమ్పురాన్” రాబోతోంది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్‌లాల్ మరొకసారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మెప్పించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
గతంలో, “లూసిఫర్ 1″కి ముందు వచ్చిన “ఒడియన్” అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే “మరక్కర్” సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే, ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన “బ్రో డాడీ” మంచి విజయం సాధించింది. ఇప్పుడు “బరోజ్” నిరాశపరిచిన నేపథ్యంలో, మోహన్‌లాల్ అభిమానులు “ఎమ్పురాన్” ఘనవిజయం సాధిస్తుందని నమ్ముతున్నారు.
మార్చి 27న థియేటర్లలో విడుదల కాబోతున్న “లూసిఫర్ 2” మోహన్‌లాల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేనా? ఈ చిత్రం మలయాళ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అన్నది వేచిచూడాలి.