Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకునేది తెలుగమ్మాయినేనా.. చరణ్ రివీల్ చేసిన సీక్రెట్..?
Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వారిలో మొదటి స్థానంలో ఉంటారు ప్రభాస్. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతటి స్థాయికి తీసుకెళ్లిన మొట్టమొదటి హీరో అని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ మొదట్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు వీడి మొహానికి యాక్టింగ్ వస్తుందా సినిమాల్లో హీరో అవుతాడా అంటూ నవ్వుకున్నారు.
Will Prabhas marry a Telugu girl Ram Charan secret revealed
అలాంటి ప్రభాస్ పడి లేచిన కెరటంలా చివరికి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా ఎదిగాడు. ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతున్న ఈయన ఎంత ఏజ్ పెరుగుతున్నా కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తాజాగా ప్రభాస్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. (Prabhas)
Also Read: Game Changer Review: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ అండ్ రేటింగ్!!
ఈ మధ్యకాలంలో అను స్టాపబుల్ షోకు రాం చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి ప్రభాస్ గురించి కూడా ఒక విషయాన్ని బయటపెట్టారు. ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి, గ్లోబల్ స్టార్ ప్రభాస్ వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు రామ్ చరణ్ వెల్లడించారు..
ఆ అమ్మాయి అచ్చమైన పల్లెటూరు అని తెలుస్తోంది. ఆమె ఊరు పేరు మాత్రం రిలీజ్ చేయలేదు.. ఆయన చెప్పిన విషయం పూర్తిగా బయటకు రాలేదు. ఆ షో పూర్తిగా ప్లే అవుతే అసలు విషయం బయటకు వస్తుంది. ఇక ప్రభాస్ సినిమాల్లో దూసుకుపోతున్నాడు తప్ప పెళ్లిపై ఆలోచన చేయడం లేదు. మరి 2025లో అయినా ప్రభాస్ పెళ్లి అవుతుందా లేదంటే ఈ ఏడాది కూడా వాయిదా పడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, కల్కి2, సలార్2, ఫౌజజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.(Prabhas)