Heroine: ఆ శృంగార తార ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు చేస్తుందా.?
Heroine: మన దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో ఒకేత్తయితే బాలీవుడ్ ఇండస్ట్రీ మరో ఎత్తు.. ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు ఒక రోల్ మోడల్ గా చెప్పవచ్చు.. ఎలాంటి కొత్త ట్రెండ్ అయిన ఈ ఇండస్ట్రీ నుంచే ప్రారంభం అవుతుంది. అలాంటి బాలీవుడ్ లో మంచి గుర్తింపుతో దూసుకుపోయినటువంటి బోల్డ్ హీరోయిన్లలో సన్నీలియోన్ ఒకరు.. ముఖ్యంగా ఈమె శృంగార తారగా అందరికీ పరిచయమైంది..
Will that romantic star Heroine grab land
అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం బోల్డ్ సినిమాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది. హిందీ సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా చాలా చిత్రాల్లో నటించింది.. అలాంటి సన్నీలియోన్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పట్టు ఉంది.. ముఖ్యంగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అంతేకాకుండా కరెంటు తీగ, జిన్నా వంటి చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది.. (Heroine)
Also Read: Ram Charan Film: ప్రయోగాలన్నీ చరణ్ మీదే ఎందుకు.. RC16 పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్!!
అలాంటి ఈమె తాజాగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిందంటూ ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అది కాస్త కోర్టు వరకు వెళ్ళింది.. ముఖ్యంగా ఫిర్యాదులో రెస్టారెంట్ మరియు బార్ నిర్మాణం కారణంగా ఇందిరాగాంధీ ప్రతిష్టన్ గోప్యత భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ విషయంపై జస్టిస్ అశోక్ కుమార్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు సంబంధించి ఫిబ్రవరి 19కి వాయిదా వేశారట..
ముఖ్యంగా ఆమె చేయబోయే నిర్మాణం హైకోర్టుకు దగ్గరగా ఇందిరాగాంధీ ప్రతిష్టన్ కు దగ్గరలో ఉండడం వల్ల మరింత చిక్కులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు సన్నీలియోన్ కు డెవలపర్ ఇచ్చినటువంటి సైట్ ప్లాన్ కాకుండా దాని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిందని ఫిర్యాదుదారుడు ఇందులో ఆరోపణ చేశారు.. దీంతో సన్నీలియోన్ ప్రభుత్వ భూమి కబ్జా చేసిందంటూ మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. మరి ఫైనల్ గా ఫిబ్రవరి 19న ఈ కేసు గురించి ఎలాంటి తీర్పు వస్తుందనేది ముందు ముందు తెలుస్తుంది.(Heroine0