Dosa: దోశ పిండి మిక్సీ పట్టేటప్పుడు వీటిని కలిపితే పిండి చక్కగా పులుస్తుంది..
Dosa: చలికాలంలో దోశ పిండి పులవడంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల పిండి సాఫీగా పులవడం లేదు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే, చలికాలంలో కూడా మంచి పిండి రావడంతో పాటు, దోశలు సాఫీగా వస్తాయి. సాధారణంగా, దోశ పిండి తయారీకి బియ్యం, మినప పప్పు ఉపయోగిస్తారు. అయితే, చలికాలంలో పిండి బాగా పులవడంలేదు అంటే, దానిని ఎలా నానబెట్టాలో, ఎలాంటి నీరు వాడాలో, పిండిని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
Winter Tips for Soft and Smooth Dosa Batter
దోశ పిండి తయారీలో బియ్యం మరియు మినప పప్పు మోతాదు చాలా కీలకమైనది. 1 గ్లాస్ మినప పప్పు కి 2 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఈ మోతాదులో తీసుకుంటే, పిండి పర్ఫెక్ట్ గా పిలుస్తుంది. కొంతమంది, బియ్యం ఎక్కువగా, మినప పప్పు తక్కువగా తీసుకోవడం వల్ల పిండి సాఫీగా పులవదు. అందువల్ల, సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. అలాగే, దోశ పిండి ఎక్కువ రుచిగా, మంచి రంగులో ఉండటానికి, ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టాలి. మెంతులు వేయడం వల్ల, దోశ కు అందమైన రంగు వస్తుంది మరియు పిండి సాఫీగా పులుస్తుంది.
Also Read: Shobita Dhulipala Enjoys Dance: ఊ అంటావా.. ఊహూ అంటావా.. బన్నీ పాటకు శోభిత స్టెప్స్.. అదుర్స్..!!
చలికాలంలో, పిండి మిక్సీ పట్టేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం చాలా ముఖ్యమైంది. సాదారణంగా, చలికాలంలో గోరువెచ్చని నీటిని పిండి లో కలపడం వల్ల, అది త్వరగా పులవడంలో సహాయపడుతుంది. అయితే, ఎక్కువ నీటిని పోవడం మిక్సీ జార్స్ నష్టపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి, తక్కువ మోతాదులో గోరువెచ్చని నీటిని వేసి, పిండి పులిపించాలి. మిక్సీ పట్టిన తర్వాత, పిండిని వేరే గిన్నెలో మార్చి, ఒక రాత్రి మొత్తం ఉంచాలి. వేడి ఉండే ప్రదేశంలో పిండి ఉంచడం వల్ల, అది బాగా పులవుతుంది.
చలికాలంలో దోశ పిండి సాఫీగా, మృదువుగా ఉండాలంటే, పిండిని మంచి స్థలంలో ఉంచుకోవడం కూడా ముఖ్యం. మంచి విధంగా ఉంచిన పిండి ఉదయం సాఫీగా పులుస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే, చలికాలంలో కూడా మంచి దోశలు తినవచ్చు.