Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
Aryaman Birla: మధ్యప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా మరోసారి వార్తల్లో నిలిచాడు. దీనికి గల ప్రధాన కారణం అతని సంపాదన. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ గౌరవంతో పాటు చాలా డబ్బును సంపాదించారు. అయితే ఆర్యమాన్ బిర్లా వారి కన్నా ధనవంతుడని చాలామందికి తెలియదు. మీడియా నివేదికల ప్రకారం ఆర్య మాన్ బిర్లా నికర విలువ 7వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.
Worlds Richest Cricketer Aryaman Birla Story

ఇది సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కన్నా చాలా ఎక్కువ సంపాదన. ఆర్యమాన్ బిర్లా కేవలం 22 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు దూరం అయ్యాడు. అతను తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ను 2019లో ఆడడం జరిగింది. ఆర్యమాన్ తన మానసిక ఒత్తిడి కారణంగా పదవి విరమణ చేశాడు. అనంతరం 2023లో ఆదిత్య బిర్లా గ్రూప్ లో చేరాడు. ఆర్య మాన్ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు.
Also Read: Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి భర్త ఎవరో తెలుసా..అందరికి తెలిసిన నటుడే!!
గత సంవత్సరం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కి డైరెక్టర్ అయ్యాడు. ఆర్యమాన్ బిర్లా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేశాడు. అతను 9 ఫస్ట్ క్లాస్, 4 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడాడు. 2018లో ఆర్యమాన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసుకుంది. కానీ అతనికి ఆడే అవకాశం రాలేదు. మరుసటి సంవత్సరం ఆర్యమాన్ బిర్లా క్రికెట్ కు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆర్యమాన్ బిర్లా సంపాదన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.