WPL Auction 2025: WPL వేలంలో జాక్‌పాట్ కొట్టిన సిమ్రాన్..జట్ల పూర్తి వివరాలు ఇవే !
WPL Auction 2025: ఆదివారం బెంగళూరులో జరిగిన WPL వేలంలో సిమ్రాన్ షేక్ కు భారీ ధర వచ్చింది. రూ.10 లక్షల బేస్ ధర నుండి షేక్‌ను ₹1.9 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. డియాండ్రా డోటిన్ ను కూడా ₹50 లక్షల నుంచి ₹1.7 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. డేనియెల్లా గిబ్సన్, ప్రకాశిక నాయక్‌లను వరుసగా ₹30 లక్షలు, ₹10 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్. భారత వెటరన్ స్నేహ రానా అమ్ముడుపోలేదు. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా భారీ కొనుగోళ్లు చేసింది. ప్రేమ రావత్ ను ₹1.2 కోట్లకు కొనుగోలు చేసింది. WPL Auction 2025
ప్రతి జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:
ఢిల్లీ రాజధానులు: ఎన్ చరణి, నందిని కశ్యప్, సారా బ్రైస్ (స్కాట్లాండ్), నికి ప్రసాద్
గుజరాత్ జెయింట్స్: సిమ్రాన్ షేక్, డియాండ్రా డాటిన్ (WI), డేనియల్ గిబ్సన్ (Eng), ప్రకాశిక నాయక్
ముంబై ఇండియన్స్: జి కమలిని, నాడిన్ డి క్లెర్క్ (SA), అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా
RCB: ప్రేమ రావత్, జోషిత JV, రాఘవి బిస్త్, జాగ్రవి పవార్ (అందరూ అన్‌క్యాప్డ్)
UP వారియర్జ్: అలానా కింగ్ (ఆస్), అరుషి గోయెల్, క్రాంతి గౌడ్