
YCP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు కూటమి నేతలు. చిన్న తప్పిదం చేసినా, వైసీపీ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఇక తాజాగా వైసీపీ నేతలకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం పుట్టిన రోజున కోడిని కోశారని కేసు నమోదు చేశారు పోలీసులు. YCP
YCP Case of killing a chicken on Jagan birthday
డిసెంబర్ 21న కోడిని కోసి వైఎస్ జగన్ ఫ్లెక్సీ రక్తాభిషేకం చేశారంటూ కేసు నమోదు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. వైసీపీ కార్యకర్తలపై http://Cr.No.21/2026 u/s 196(1), 351(2) r/w 3(5) BNS కేసు నమోదు చేశారు పోలీసులు. YCP
Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?
నలందుల బాలసుబ్రమణ్యం రెడ్డి @ బాలు (A1), అమ్ముగుంట భువన్ కుమార్ (A2) గా కేసులు నమోదు చేశారు పోలీసులు. తిరుపతి కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించారని కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో రిమాండ్‌కు తరలించారు పోలీసులు. YCP
Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మరో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్ ?





