Botsa Satyanarayana: కాకినాడలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 3 చూపించాడు ?
Botsa Satyanarayana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుందని బొత్స వ్యంగ్యంగా హాట్ కామెంట్ చేశారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 సినిమాలలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా అతను గుర్తు చేశాడు. Botsa Satyanarayana
YCP MLC Botsa Satyanarayana hot comments on AP Deputy CM Pawan Kalyan
సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ…. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారని బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవద్దని ఎవరు అన్నారని బొత్స అన్నారు. 2004 సంవత్సరంలో బొత్స మంత్రి అయిన సమయంలో తనకు ఎన్నో అధికారాలు ఉన్నాయని భ్రమ పడ్డానని బొత్స అన్నారు. మొదట్లో మంత్రి పదవి వచ్చిన సమయంలో హూ… ఆ…. అంటామంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా సత్యనారాయణ విమర్శలు చేశాడు. Botsa Satyanarayana
Also Read: Jasprit Bumrah: IPL మెగా వేలంలో బుమ్రాకు రూ. 520 కోట్లు ?
కానీ వారు, వీరు కూర్చొని మాట్లాడుకొని కష్టసుఖాలు తెలుసుకున్న తర్వాత అన్ని మర్చిపోతారని వెల్లడించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాలు లాగా మాట్లాడటం లేదని బొత్స అన్నారు. షర్మిలను మీరు గుర్తిస్తున్నారేమో కానీ మేము గుర్తించడం లేదని బొత్స వెల్లడించారు. తాను సైతం గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానంటూ బొత్స చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ గా పలు అంశాలపైన మాట్లాడాలి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అంటూ వైయస్ షర్మిల వ్యవహార శైలిని బొత్స విమర్శించారు. బొత్స చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. Botsa Satyanarayana