YCP: జనసేనలోకి విజయ సాయి, ధర్మాన… షాక్ లో జగన్ ?
YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమై కొంతమంది నేతలు తెలుగుదేశం కూటమిలోకి చేరిపోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన లీడర్లు కూడా వైసీపీని వీడారు. YCP

ycp vijayasai reddy dharmana into janasena party
అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారట. విజయసాయిరెడ్డి తో పాటు ధర్మాన ప్రసాదరావు కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. ఈ ఇద్దరు లీడర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులను అనుభవించారు. విజయసాయి రెడ్డి ఇంకా కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. YCP
Also Read: Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?
అయితే ఈ ఇద్దరు లీడర్లు జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం అయిందట. ఇందులో భాగంగానే మొన్న విజయసాయిరెడ్డి… పవన్ కళ్యాణ్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన సంగతితెలిసిందే. దీంతో విజయసాయిరెడ్డి జంప్ అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం వైసీపీ ఇన్చార్జి పదవి ఇస్తామని చెప్పినా కూడా ధర్మాన ఒప్పుకోవడం లేదట. పార్టీకి దూరంగా ఉంటున్నారట. ఆయన కూడా జనసేన టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. YCP