Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు.. 100 రోగాలకు చెక్ !
Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తోంది. మార్కెట్లో చాలా ఎక్కువగా వీటి అమ్మకం పెరిగిపోయింది. ఈ పండులో ఉండే పిఠాయా అనే పోషకం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇందులో ఫినోలిక్ యాసిడ్, ఫైబర్ వంటివి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

You can’t imagine the health benefits of dragon fruit
దీని గింజలలో ఉండే ఒమేగా-3, ఫ్యాట్ ఆమ్లాలు శరీరంలోని కొలస్ట్రాల్ ను పెంచి గుండెపోటు ద్వారా వచ్చే ప్రమాదాలను తగ్గిస్తున్నాయి. ఇందులో పీచు, నీరు సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటారు. అందుకే డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు వారానికి ఒక్కసారైనా ఈ ఫ్రూట్ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు, ప్రోటీన్లు, కెరోటిన్ అధికంగా ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్, డెంగ్యూ, క్యాన్సర్ సంబంధిత సమస్యలను తొలగిస్తోంది. విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. ఈ పండులో విటమిన్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్ తిన్నట్లయితే మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో బయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు, మలబద్ధకం నుంచి కాపాడుతాయి. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఎముకలు బలపడతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.