Youtube: ప్రముఖ వీడియోస్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న విషయం మనకి తెలుసు. యూజర్ల అవసరాలకి అనుకూలంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది యూట్యూబ్లో గంటల గంటల సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే యూట్యూబ్ లో వచ్చే కొన్ని వీడియోలు కి సంబంధించిన ఆడియో ఫైల్స్ ని సేవ్ చేసుకుంటే బావుంటుంది కదా ఎందుకు కూడా మార్గాలు ఉన్నాయి..? అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్లో ఒక మంచి పాట లేదంటే మనకి నచ్చిన వాటిని MP3 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మందికి mp3 వెర్షన్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది.
Youtube audio download from videoes
కానీ తెలియక ఆగిపోతుంటారు. MP3 అయితే రోజుకు ఉచితంగా 15 కన్వర్టర్లను ఈ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. యూట్యూబ్ వీడియోలను చాలా సులభంగా ఆడియోగా మార్చుతుంది. యూట్యూబ్ వీడియో యుఆర్ఎల్ ని పేస్ట్ చేస్తే చాలు వెంటనే కన్వర్ట్ అవుతుంది. విండోస్ మాక్ రెండిట్లో కూడా ఈ వెబ్సైట్ సపోర్ట్ చేస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ వీడియోలని ఆడియో ఫైల్స్ గా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ లింక్ ని మీరు అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఆడియో ఫార్మాట్లోకి డైరెక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది అలా ఇంకా వెబ్సైట్ లో చాలా ఉన్నాయి. ఏస్ థింకర్ డాట్ కామ్ కూడా మంచి సోర్సే ఈ వెబ్సైట్లో కూడా మీరు సెర్చ్ బాక్స్ లో యూట్యూబ్ వీడియో లింక్ ని పేస్ట్ చేసి ఆడియో ని పొందవచ్చు.
Also read: Tasty Teja: డ్రైవింగ్ చేస్తూ అవేం పనులు భయ్యా.. టేస్టీ తేజ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..!
సౌండ్ క్వాలిటీని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది అలాగే డీర్పీ అని ఇంకొక వెబ్సైట్ ఉంది. దీని ద్వారా కూడా మనం వీడియోని ఆడియో కింద కన్వర్ట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు ఈజీగా పొందవచ్చు. రికార్డ్ ఆడియోలోకి వెళ్లి MP3 లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా క్వాలిటీని ఎంచుకుని రికార్డ్ ఆడియో బటన్ క్లిక్ చేయండి వెంటనే MP3 ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇలా మీరు ఈజీగా యూట్యూబ్ వీడియోలని ఆడియో కింద మార్చుకోవచ్చు అది కూడా ఎంతో ఈజీగానే. మరి ఇంక లేట్ ఎందుకు మీకు నచ్చిన వీడియోస్ ని సెలెక్ట్ చేసుకుని ఆడియోస్ కింద పొందండి (Youtube).