Ys Jagan: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన రద్దుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు దేవుడిని దర్శించుకునే హక్కు ఉందా?” అని ప్రశ్నిస్తూ, తనను మరియు పార్టీ కార్యకర్తలను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూస్తున్న పరిస్థితులు ఇవి కావని తెలిపారు.
Ys Jagan Expresses Anger Over Tirumala Visit Cancellation
తాను తిరుమల వెళ్లాలని అనుకుంటే, చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను అక్కడకు రప్పించినట్లు ఆరోపించారు. “లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తున్నది?” అని నిలదీశారు. రాజకీయ స్వార్థం కోసం సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు.
Also Read: Harish Rao: ప్రభుత్వాన్ని హెచ్చరించిన హరీష్ రావు.. దసరా లోపు ఇవ్వాలని డిమాండ్!!
తిరుమల మరియు ప్రసాదం పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ఆక్షేపించారు. జరుగని విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. “ఓ ముఖ్యమంత్రే తిరుమలని దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని” జగన్ ఆగ్రహంతో పేర్కొన్నారు.
నెయ్యి కొనుగోలు కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి జరుగుతున్నా, చంద్రబాబు అందులో రాజకీయం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. “లడ్డూ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలేనని, దానికి సాక్ష్యాలతో నిరూపిస్తామని” జగన్ చెప్పారు. లడ్డూ వివాదంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని ఆయన పేర్కొన్నారు.