వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి రాజకీయ వివాదాల్లో చిక్కుకున్నారు. అధికారం నుంచి దూరమైనా, ఆయన వ్యవహార శైలి మాత్రం పూర్తిగా మారలేదు. తప్పు చేసిన వారికి, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారికి, రౌడీషీటర్లకు ఆయన నిరంతరం అండగా నిలుస్తుండటం ఆయన రాజకీయ దిగజారుడును రుజువు చేస్తోంది.
YS Jagan Pushing Controversies Daily
గతంలో 2019లో జరిగిన వైఎస్ వివేకా హత్య కేసులో గొడ్డలి పోటు ఘటనను ప్రస్తావిస్తూ, ఆయన చంద్రబాబుపై నారాసుర రక్త చరిత్ర అనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు 2026 నాటికి కూడా ఆ అబద్ధాల బాణాలు ఆగడం లేదు. ఓటమి అనంతరం వైసీపీ నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే సీదిరి అప్పలరాజు అనే నేత రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాంటి వ్యక్తికి జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం విశేషం.
ఇంకా చెప్పాలంటే, పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేసి పొగాకు బేళ్లను స్వాధీనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కొడుకు బషీర్లకు కూడా జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. పోలీసులకు వారిని అప్పగించినా, కిడ్నాప్ కేసు పెట్టడం తప్పని ఆయన వెనకేసుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే, జగన్ రాజకీయాలు పూర్తిగా పతనమయ్యాయనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కొనసాగిస్తూనే, నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆయన వ్యవహారం ఆయనకే భవిష్యత్తులో పెను నష్టం తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వ్యవహారాలు ఆయన ఇమేజ్ను మరింత దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





