Ys Jagan: దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే… జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటాడని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నారు. Ys Jagan
Ys Jagan to Tirumala by walking
అయితే దీనిపై వైసిపి కౌంటర్ ఇచ్చిన కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టేలా జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వయంగా తానే తిరుమలకు వెళ్లి… ఈ వివాదానికి చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే ఈనెల 28వ తేదీ అంటే శనివారం రోజున.. కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. Ys Jagan
Also Read: Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురు.. అరెస్టు తప్పదా ?
ఈ సందర్భంగా లడ్డుపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారట. క్రైస్తవ మతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని హిందువుల్లో.. అపనమ్మకాన్ని పోగొట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పైన అందరి దృష్టి నెలకొంది. తిరుమలలో పర్యటించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు జగన్ మోహన్ రెడ్డి వెళ్లి.. తన పైన పడ్డ మరకను… తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. Ys Jagan