Jagan: ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
Jagan: డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కోరిన వైఎస్ జగన్… ఈ మేరకు లేఖ రాశారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని ఈ లేఖలో తెలిపారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిందన్నారు.

YS Jagan writes letter to PM Modi on delimitation
High Court: పెట్రోల్ బంకుల్లో మోసాలు.. ఏపీ హై కోర్టు సంచలన తీర్పు ?
గతంలో కేంద్రం ఇచ్చిన జనభా నియంత్రణ పిలుపు మేరకు ఈ తగ్గుదల కనిపించిందని తెలిపారు. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డిలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుందన్నారు. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని వెల్లడించారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు.
Congress: నెల రోజుల పాటు.. ఊరూరా కాంగ్రెస్ పండుగ !
అందుకే దక్షణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలన్నారు. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా అని తెలిపారు వైఎస్ జగన్.
Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?