Zainab: ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సిన జైనబ్.. కానీ అఖిల్ కి భార్యగా.. ఎక్కడ చెడిందంటే.?
Zainab: ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జున చిన్నకోడలు గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే ఆమె పేరు బ్యాగ్రౌండ్ కొద్ది కొద్దిగా బయటపడుతున్నప్పటికీ ఆమె ఏజ్ విషయంలోనే కాస్త తేడా కొడుతోంది. ఎందుకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు ఏంటి అని కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Zainab was supposed to marry that hero
అయితే ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు అన్నట్లు ఎవరికీ ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్లతోనే పెళ్లి జరుగుతుంది. అయితే జైనబ్ రావడ్జి కేవలం పెయింటర్ మాత్రమే కాదు థియేటర్ ఆర్టిస్టు అని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అలాగే పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసిందట. అంతేకాకుండా జైనబ్ కి బాలీవుడ్ సెలబ్రెటీస్ తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయట.(Zainab)
Also Read: Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి.. అంతా పుకారేనా?
అలా ఓ బాలీవుడ్ హీరో జైనబ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. కానీ ఎక్కడ చెడిందో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి పరిచయం ఉన్న జైనబ్ రావడ్జి ని పెళ్లయి పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న ఓ బాలీవుడ్ హీరో ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.అంతేకాదు ఆమెకి మ్యారేజ్ చేసుకుంటానని కూడా చెప్పారట.కానీ జైనబ్ రావడ్జి మాత్రం తనకి ఇష్టం లేదని మొహం మీదే చెప్పేసిందట.
ఒకవేళ జైనబ్ ఆ బాలీవుడ్ హీరోతో పెళ్లికి ఒప్పుకుంటే ఆ హీరోకి భార్యగా మారిపోయేది. కానీ ఆ హీరో ప్రపోజ్ చేయడం కంటే ముందే జైనబ్ అక్కినేని అఖిల్ తో ప్రేమలో ఉందని తెలుస్తోంది.వీరిద్దరూ దాదాపు 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. అందుకే ఆ హీరో ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిందట. అలా చివరికి అక్కినేని ఫ్యామిలీలోకి చిన్న కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతోంది.(Zainab)