Zika virus: ఏపీలో జికా వైరస్ కలకలం…లక్షణాలు ఇవే.. ఎలా గుర్తించాలి ?
Zika virus: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ల బత్తల సుబ్బారాయుడు అనే వ్యక్తికి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. Zika virus
Zika virus outbreak in AP
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఆరేళ్ల సుబ్బారాయుడికి అనారోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సలు చేపించారు. బాలుడి అనారోగ్య లక్షణాలపై వైద్యులకు అనుమానం రావడంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు మరోసారి రక్త నమూనాలను సేకరించి పూణేలోని ల్యాబ్ కు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులు బాలుడిని చెన్నై ఆసుపత్రికి తరలించారు. Zika virus
Also Read: Kohli – Gambhir: గంభీర్ – కోహ్లీ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ సీరియస్..?
జికా వైరస్ లక్షణాలు
జికా వైరస్ వ్యాధి సాధారణంగా తేలిక పాటిది. నిర్దిష్ట చికిత్స అవసరం ఉండదు. అత్యంత సాధారణ లక్షణాలు ఉంటాయి. అంటే జ్వరం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు మరియు కనురెప్ప యొక్క దిగువ భాగంలో వాపులు ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2-7 రోజులు ఉంటాయి. లక్షణాలు మరీ తీవ్రమైతే వారు వైద్య సంరక్షణ మరియు సలహాలు తీసుకోవాలి. Zika virus