Zomato: కొత్త పేరు పెట్టుకున్న ”జొమాటో”.. ఏంటంటే..?
Zomato: జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే ప్రక్రియ ఆన్లైన్ లో విపరీతంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో వంట చేయడం చాలావరకు తగ్గించేశారు. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ దీనిపై ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా కాలం నుంచి ప్రతి ఒక్కరూ జొమాటోనూ విపరీతంగా వాడుతున్నారు.

Zomato Changes Name To Eternal Limited
ముఖ్యంగా జోమాటో వల్ల బ్యాచిలర్స్ చాలా లాభ పడుతున్నారు. వారికి వంట చేసుకునే సమయం ఉండదు. బిజీ లైఫ్ కారణంగా బ్యాచిలర్స్ ఎక్కువగా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయితే జొమాటో తాజాగా తన పేరును మార్చుకుంది. ఇక నుంచి జొమాటో లిమిటెడ్ పేరుకు బదులుగా ఎటర్నల్ లిమిటెడ్ అనే పేరు పెట్టుకుంది.
ఇక నుంచి ఎటర్నల్ లిమిటెడ్ అనే పేరు కొనసాగుతుందని తాజాగా అనౌన్స్ చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. షేర్ హోల్డర్లు ఈ పేరును తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరి పేరు మార్చుకున్న తర్వాత ఎప్పటిలాగే జోమాటో తన సేవలను కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.