టాక్సిక్ మూవీ రీషూట్ రూమర్లకు ఫుల్ స్టాప్: మేకర్స్ క్లారిటీ!

Telugu poster debunking Toxic rumors with a false rumor stamp and makers' clarity statement
Telugu poster debunking Toxic rumors with a false rumor stamp and makers' clarity statement
Toxic rumors debunked: the makers set the record straight with a clear statement.

Toxic movie గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రీషూట్స్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సినిమా అవుట్‌పుట్‌పై యష్ అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే భారీగా ఖర్చు చేసి కొన్ని సీన్స్‌ను మళ్లీ తీయాలని ప్లాన్ చేశారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ రూమర్లపై చిత్ర బృందం తాజాగా స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని వారు తేల్చిచెప్పారు. ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం ఫైనల్ కంటెంట్ రెడీగా ఉందని వెల్లడించారు.

రీషూట్స్ జరుగుతున్నాయన్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మేకర్స్ పేర్కొన్నారు. సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అసత్య ప్రచారాన్ని అభిమానులు నమ్మవద్దని కూడా సూచించారు.

యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ సినిమాపై ఈ క్లారిటీతో ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. త్వరలోనే సినిమా విడుదల తేదీపై మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Telugu poster debunking Toxic rumors with a false rumor stamp and makers' clarity statement

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu