Rohit Sharma: ప్రస్తుతం క్రికెట్‌లో అత్యాధునిక టెక్నాలజీ వాడకం వల్ల అంపైర్‌ల పొరపాట్లు చాలా తగ్గాయని చెప్పొచ్చు. బాల్‌ ట్రాకింగ్‌తో సహా ఫీల్డ్‌లో జరుగుతున్న ప్రతి విషయాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. దీనివల్ల బ్యాటర్లు అవుట్‌ కావడం లేదా వికెట్ కోల్పోవడం అంత సులభం కాదు. రివ్యూ తీసుకోవడం ద్వారా తప్పుగా వెలువడిన నిర్ణయాలను సవాల్‌ చేయడం తో ఎక్కువ పొరపాట్లు జరగడం లేదు. అయితే టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ టెక్నాలజీని ఉపయోగించకపోవడం విశేషం.

Rohit Sharma Reacts as Kohli Misses LBW Appeal

ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మధ్య చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు రెండో రోజు భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. బంగ్లాదేశ్‌ను 149 పరుగులకు ఆలౌట్‌ చేసి, 227 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ బాగా ఆడుతూ గెలుపు దిశగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన టీం ఇండియా ఎదుర్కొంది. విరాట్‌ కోహ్లి, జైస్వాల్ అవుట్‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చి శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

Also Read: IPL 2025: RCB లోకి అర్జున్ టెండూల్కర్..కోహ్లీ అదిరిపోయే స్కెచ్?

అయితే, 18వ ఓవర్‌లో బంగ్లాదేశ్‌ బౌలర్‌ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అప్పటికే కోహ్లి 37 బంతుల్లో 17 పరుగులు చేశాడు. బంతి బ్యాటర్ వైపుకు స్పిన్‌ అవడంతో, అంపైర్‌ వెంటనే అవుట్‌ ఇచ్చాడు. కోహ్లి, గిల్‌తో చర్చించాక, రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించాడు. తర్వాత రీప్లేలో బ్యాట్‌కు బంతి తాకినట్లు తేలింది. కోహ్లి రివ్యూ తీసుకుంటే అవుట్‌ కాకుండానే నిలబడేవాడు. ఈ తప్పిదం చూసిన రోహిత్‌ శర్మ చిరాకు వ్యక్తం చేయగా, అంపైర్‌ రిచర్డ్ కెటిల్‌బరో నవ్వుకుంటూ బయటపడ్డారు.