
ADI SRINIVAS PA : ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టినట్టు సమాచారం. దినేష్ వేధింపులను తట్టుకోలేక భార్య అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అధికార పార్టీ, డబ్బు బలంతో కేసు క్లోజ్ చేయిస్తున్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో నిన్న అనుమానస్పద స్తితిలో మృతి చెందిన ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ భార్య రోహిణి(32) ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరూ పిల్లలున్నారు. ADI SRINIVAS PA
Is he the reason for the death of the wife of Government Whip Adisrinivas PA
అయినప్పటికీ అతను ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. నిత్యం ఇతర మహిళలతో తిరుగుతూ భార్య రోహిణిని చితకబాదుతూ చిత్ర హింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది. రోహిణి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో తన పలుకుబడిని ఉపయోగించుకొని రోహిణీ శరీరం పై చాలా చోట్ల దెబ్బలున్నాయి. అయితే దినేష్, అతని కుటుంబ సభ్యులు ఆమెను చంపేసి.. ఉరి వేసి ఆత్మహ*త్య కోణంలో చిత్రీకరించారని రోహిణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ADI SRINIVAS PA
Also Read : KAVITHA : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. కవిత సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వద్ద పీఏ గా పని చేయడం వల్ల దినేష్ గౌడ్ కి పలుకుబడి ఎక్కువగా ఉండటం.. పోలీస్ బలగాలను సెక్యూరిటీగా ఉపయోగించి తమను భయబ్రాంతులకు గురి చేసాడని ఆవేదన వ్యక్తం చేశారు రోహిణీ కుటుంబ సభ్యులు. గత ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ధన సాయం చేసాడని.. దీంతో రోహిణీ అనుమానస్పద మృతిని ఆత్మహత్యలా చిత్రీకరించినట్టు ఆరోపణలు వినిపించడం గమనార్హం. ADI SRINIVAS PA
Also Read : Viral Video :ఆపరేషన్ కి ముందు 96 ఏళ్ల వృద్ధుడి వింత కోరిక.. అది వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!





